బెంగళూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

బెంగళూరు నగరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు

Update: 2024-12-21 11:51 GMT

బెంగళూరు నగరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. బెంగళూరు నగర శివారులోని నేలమంగళ తాలూకా తాలెకెరెలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ట్రక్కు డ్రైవర్ వాహనాన్ని కుడివైపునకు తిప్పాడు. దీంతో ట్రక్కు అదుపుతప్పి డివైడర్ పైనుంచి వెళ్లి మరో మార్గంలోని కారుపై పడింది.

కారుపై పడటంతో...
ఈ ఘటనలో కారులోని ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. వాహనం నుజ్జునుజ్జు కాగా, అందులో ఇరుక్కుపోయిన మృతదేహాలను స్థానికుల సహకారంతో పోలీసులు బయటకు తీశారు. ట్రక్కు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతులు ఎవన్నది ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News