క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది.
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న కొమ్మాలపాటి సాయికుమార్ క్రిస్మస్ సెలవులకు ఇంటికి వచ్చి స్నేహితులతో కలిసి క్రికెట్ పోటీల్లో పాల్గొన్నాడు.
క్రిస్మస్ కు వచ్చి...
క్రికెట్ ఆడుతుండగా సాయికుమార్ కుప్పకూలిపోయాడు. వెంటనే స్నేహితులు సాయికుమార్ ను ఆసుపత్రికి తరలించారు. కానీ సాయికుమార్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో సాయికుమార్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడంతో గ్రామస్థులు ఈ ఘటనను జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ