అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు.హన్మకొండ జిల్లాకు చెందిన బండి వంశీ అనుమానాస్పద స్థితిలో మరణించారు.

Update: 2024-12-23 02:21 GMT

Telugu students died in america.

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేటకు చెందిన బండి వంశీ అనుమానాస్పద స్థితిలో మరణించారు. అతడు ఉంటున్న అపార్ట్ మెంట్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కారులో శవమై కనిపించారు. ఎంఎస్ చదివేందుకు గతేడాది వంశీ అమెరికాకు వెళ్లారు.

మృతదేహాన్ని...
వంశీ మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించాలని ఆయన తల్లిదండ్రులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కు విజ్ఞప్తి చేశారు. అయితే వంశీ మరణానికి గల కారణాలు మాత్రం తెలియరావడం లేదు. కారులో శవమై కనిపించడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు అక్కడ కేసు నమోదు చేసి విచారణ జరిపిన తర్వాత తెలియనుంది.



ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now



Tags:    

Similar News