కాకినాడలో గంజాయి గ్యాంగ్ దారుణం
కాకినాడలో గంజాయి గ్యాంగ్ దారుణానికి పాల్పడింది. కానిస్టేబుల్స్ పై కారును నడిపివారికి ప్రమాదానికి గురయ్యేలా చేసింది;
కాకినాడలో గంజాయి గ్యాంగ్ దారుణానికి పాల్పడింది. కానిస్టేబుల్స్ పై కారును నడిపివారికి ప్రమాదానికి గురయ్యేలా చేసింది. అయితే యాక్సిడెంట్ చేసిన గంజాయి గ్యాంగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని తెలిసింది. కారులో ఉన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కృష్ణవరం గ్రామంలో టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తుండగా కారును కానిస్టేబుళ్ల మీద నుంచి గంజాయి బ్యాచ్ పోనిచ్చింది. దీంతో ఇద్దరు కానిస్టేబుల్స్ గాయపడ్డారు. రాజానగరం వద్ద కారును వదిలేసి వారు పరారయ్యారు.
ఇద్దరిని అదుపులోకి తీసుకుని...
ఈ ఘటనలో కానిస్టేబుల్స్ ఇద్దరు గాయపడి ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కానిస్టేబుల్ పై దాడి జరిగిన సమాచారాన్ని తెలియచేయకపోవడంతో జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు. సీఐని దీనిపై వివరణ కోరినట్లు తెలిసింది. అయితే గంజాయి గ్యాంగ్ చిక్కడంతో వారిని విచారిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ కు చెందిన కారులో గంజాయి గ్యాంగ్ పరారయ్యారు. అయితే పోలీసులు వారిని పట్టుకోగలిగారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారని తెలిసింది.