పెట్రోల్ బంకులో ప్రమాదం.. ఐదుగురి మృతి

రాజస్థాన్ లోని జైపూర్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు;

Update: 2024-12-20 04:30 GMT
terrible accident, five people died, jaipur, rajasthan
  • whatsapp icon

రాజస్థాన్ లోని జైపూర్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. జైపూర్ లోని ఒక పెట్రోల్ బంకులో ఈ ప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారు జామున జైపూర్ - అజ్మీర్ జాతీయ రహదారిపై ఎల్పీజీ ట్యాంకర్ ను ఒక ట్రక్కు ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగడంతో పెట్రోలు బంకులకు మంటలు వ్యాపించాయి. అయితే ఈ బంకువద్ద ఉన్న వాహనాలు మంటల్లో దగ్దమయ్యాయి.

37 మందికి గాయాలు...
ఈ ఘటనలో 37 మంది గాయపడ్డారు. అయితే వెంటనే పెట్రోల్ బంకు యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఇరవై ఫైర్ ఇంజిన్లతో వచ్చి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. పెట్రోలు బంకు నుంచి పెద్దయెత్తున మంటలు చెలరేగడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.



ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

 


Tags:    

Similar News