యూపీలో ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు మృతి
ఉత్తరప్రదేశ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు మరణించారు
ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు మరణించారు. మృతులను గుర్వీందర్ సింగ్ , వీరేందర్ సింగ్ అలియాస్ రవి, జస్ప్రీత్ సింగ్ అలియాస్ ప్రతాప్ సింగ్ గా గుర్తించారు. వీరు నిషేధిత ఖలిస్థాన్ కమాండో ఫోర్స్‌కు చెందిని వారని పోలీసు అధికారులు పేర్కొన్నారు.
అందిన సమాచారం మేరకు...
పంజాబ్, ఉత్తరప్రదేశ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో వీరు హతమైనట్టు అధికారులు తెలిపారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా కలానౌర్ సబ్ డివిజన్ పోలీస్ పోస్టుపై ఈ నెల 21వ తేదీన జరిగిన దాడి ఘటనలో వీరు నిందితులుగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లు, రెండు గ్లోక్ పిస్టళ్లు, లైవ్ రౌండ్స్ స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ముగ్గురు ఉగ్రవాదులు పిలిభిత్ జిల్లాలోని పురానపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచరిస్తున్నట్టు పిలిభిత్ పోలీసులకు పంజాబ్ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారి కోసం ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఈ ఉదయం ఇరు వర్గాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now