కడపలో రోడ్డు ప్రమాదం... కారు నుజ్జునుజ్జు

వైఎస్సార్ కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు

Update: 2022-08-17 06:14 GMT

వైఎస్సార్ కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. కడప నగర శివారులోని పబ్బాపురం వద్ద ఈ ఘటన జరిగింది. కారులో కడప మెప్మా కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో పీడీ భార్య మృతి చెందారు.

ఒకరి మృతి...
పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని కారు నుంచి బయటకు తీశారు. ఈ ప్రమాదంలో పీీడీతో సహా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News