ఘోర ప్రమాదం ... ఐదుగురి మృతి

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొన్న సంఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.;

Update: 2022-08-08 07:03 GMT

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొన్న సంఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రకాశం జిల్లాలోని కంభం సమీపంలోని వాసవి పాలిటెక్నిక్ కళాశాల వద్ద లారీని వెనక నుంచి కారు ఢీకొంది. అనంతపురం - అమరావతి జాతీయ రహదారిపై సిమెంట్ లోడుతో ఉన్న లారీని కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

తిరుమలకు వెళుతూ...
మృతులు పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి మండలం సిరిగిరిపాడుకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మృతులు అనిమిరెడ్డి, గురవమ్మ, అనంతమ్మ, ఆదిలక్ష్మి, నాగిరెడ్డి లుగా గుర్తించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యాయి. వీరంతా తిరుమల దైవదర్శనానికి బయలు దేరారని, మార్గమధ్యంలో ఈ ప్రమాదం జరిగిందని మృతుల బంధువులు బోరున విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News