నందకుమార్ కు బెయిల్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు నందకుమార్ కు బెయిల్ లభించింది.;
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు నందకుమార్ కు బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ లభించడంతో ఆయన చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే నందకుమార్ బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం కొన్ని షరతులను విధించింది. షరతులకు లోబడి ఉండాలని కోరింది.
హైదరాబాద్ ను విడిచి...
హైదరాబాద్ ను విడిచి ఎక్కడకూ వెళ్లరాదని నందకుమార్ ను ఆదేశించింది. కోర్టు ఆదేశం మేరకు పదివేల పూచికత్తుతో పాటు రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ఆయన ష్యూరిటీ ఇవ్వడంతో చంచల్ గూడ జైలు నుంచి నందకుమార్ విడుదలయ్యారు.