ఇండస్ట్రీలో విషాదం.. సినీ నటి దీప ఆత్మహత్య

రెండ్రోజులుగా కుటుంబ సభ్యులు దీపతో మాట్లాడేందుకు ఎన్నిసార్లు కాల్ చేసినా స్పందించకపోవడంతో.. స్నేహితుడు ప్రభాకరన్..;

Update: 2022-09-18 10:54 GMT

సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతున్నాయి. అనారోగ్యంతో కొందరు చనిపోతుంటే.. ఎంతో భవిష్యత్ ను చూడాల్సిన యువత బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల బెంగాలీ ఇండస్ట్రీలో వరుస ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. తాజాగా తమిళ ఇండస్ట్రీలో మరో నటి బలవన్మరణానికి పాల్పడింది. తన చావుకు ఎవరూ బాధ్యులు కారని, తాను జీవితాంతం ఒకరిని ప్రేమిస్తుంటానని రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నటి దీప ఆత్మహత్య ఇండస్ట్రీలో కలకలం రేపింది.

దీప పలు తమిళ సినిమాల్లో సహాయపాత్రల్లో నటించి మెప్పించింది. రెండ్రోజులుగా కుటుంబ సభ్యులు దీపతో మాట్లాడేందుకు ఎన్నిసార్లు కాల్ చేసినా స్పందించకపోవడంతో.. స్నేహితుడు ప్రభాకరన్ ఇంటికెళ్లి చూశాడు. దీప అలియాస్ పౌలిన్ శనివారం చెన్నైలోని విరుగంబాక్కంలోని మల్లికై అవెన్యూలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిరోజులుగా ఆమె మానసిక ఒత్తిడికి గురైనట్లు స్నేహితులు చెప్తున్నారు. మరోవైపు పోలీసులు.. ప్రేమ వ్యవహారమే దీప ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు. దీప మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




Tags:    

Similar News