Eluru : ఏలూరులో దారుణం.. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ఫొటో షూట్‌లు చేస్తూ?

ఏలూరు ట్టణంలో ఉన్న దయానంద ఆశ్రమం లో అమ్మాయిల పట్ల వార్డెన్ అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసు కేసు నమోదయింది;

Update: 2024-09-18 04:29 GMT
atrocity, warden, girls,  eluru, atrocity took place in eluru, warden misbehaved with the girls in eluru

eluru

  • whatsapp icon

ఏలూరు లో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలో ఉన్న దయానంద ఆశ్రమం లో అమ్మాయిల పట్ల వార్డెన్ అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసు కేసు నమోదయింది. ఫోటో షూట్ ల పేరు తో బయటకు తీసేకెళ్లి, కాళ్లు చేతులు కట్టేసి అత్యాచారం చేస్తున్నట్టు విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది.

పోలీసుల దర్యాప్తు....
ఆశ్రమంలో ఉంటున్న విద్యార్థినుల పట్ల వార్డెన్ అమానుషంగా ప్రవర్తించడమే కాకుండా అత్యాచారానికి పాల్పడటం కూడా సంచలనంగా మారింది. రోజురోజుకూ పెరిగిపోతున్న వార్డెన్ వేధింపులను తట్టుకోలేక విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోద చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే వెంటనే వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పోలీసులు వార్డెన్ ను అదుపులోకి తీసుకుని విద్యార్థుల ఫిర్యాదుపై ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.


Tags:    

Similar News