మియాపూర్ లో దారుణం: ప్రియురాలిపై కత్తితో దాడి
హైదరాబాద్ లోని మియాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. ఆదిత్య నగర్ లో ప్రియురాలిపై ప్రియుడు కత్తితో దాడి చేశాడు
హైదరాబాద్ లోని మియాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. ఆదిత్య నగర్ లో ప్రియురాలిపై ప్రియుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అడ్డువచ్చిన తల్లిపైన కూడా యువకుడు కత్తితో దాడి చేయడంతో తల్లీ కూతుళ్లిద్దరూ తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రేమించలేదని...
విశాఖకు చెందిన సందీప్ ఆదిత్యనగర్ లో ఉంటున్న ఒక యువతిని ప్రేమించాడు. అయితే తనను ప్రేమించలేదన్న కారణంతో యువకుడు సందీప్ కత్తితో దాడి చేసినట్లు సమాచారం. దాడికి పాల్పడిన యువకుడు విశాఖపట్నంకు చెందిన సందీప్ గా గుర్తించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.