Bangalore : బాంబు బెదిరింపులు.. పది స్కూళ్లకు
బెంగళూరులోని కొన్ని స్కూళ్లకు బాంబులు బెదిరింపులు కలకలం రేపాయి.
బెంగళూరులోని కొన్ని స్కూళ్లకు బాంబులు బెదిరింపులు కలకలం రేపాయి. దీంతో పాఠశాలల యాజమాన్యంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈరోజు ఉదయం పది స్కూళ్లకు పైగానే ఈ బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్స్ ద్వారా బాంబు పెట్టామని బెదిరింపులు రావడంతో స్కూలు యాజమాన్యం కంగారు పడి, వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.
విద్యార్థుల నుంచి...
వెంటనే పాఠశాలల నుంచి విద్యార్థులను పంపించి వేశారు. పోలీసులు బాంబు స్క్కాడ్ తో వచ్చి తనిఖీలు చేపట్టారు. పాఠశాలల్లోని అన్ని మూలలా బాంబుల కోసం వెదికారు. అయితే ఎక్కడా బాంబులు లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఇది ఆకతాయిల పనా? ఎవరైనా కావాలని చేసిందా? అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మెయిల్ ఎవరి నుంచి వచ్చిందన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. బాంబు బెదిరింపులతో చాలా సేపు టెన్షన్ వాతావరణం నెలకొంది.