దొంగతనం అనుమానం.. మైన‌ర్ల‌కు మూత్రం తాగించి, మిరపకాయలతో చిత్రహింసలు

ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ జిల్లాలోని దుమారియాగంజ్ తహసీల్ ఏరియాలోని కొంకటి ప్రాంతంలో దారుణ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది.

Update: 2023-08-07 04:06 GMT

ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ జిల్లాలోని దుమారియాగంజ్ తహసీల్ ఏరియాలోని కొంకటి ప్రాంతంలో దారుణ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఇద్దరు మైనర్ పిల్లలను కట్టేసి కొట్టి, ఆపై మూత్రం తాగించి, వారి ప్రైవేట్ పార్ట్స్‌లో మిరపకాయలు ఇంజెక్ట్ చేసినందుకు ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ఘటనకు సంబంధించి ఎనిమిది మంది నిందితుల్లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ సిద్ధార్థ్ తెలిపారు. బాధిత బాలురుల‌లో ఒకరి తండ్రి ఫిర్యాదు మేరకు పత్రా పోలీస్ స్టేషన్‌లో ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన పత్ర బజార్‌లోని కొంకటి కూడలిలోని ఓ చికెన్‌ షాపులో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోళ్ల ఫారంలో రూ.2000 దొంగిలించారని నిందితులు ఇద్దరు మైన‌ర్ బాలురు చేతులు కట్టేశారు. అనంతరం వారి ప్రైవేట్ పార్ట్స్‌లో పచ్చిమిర్చి చొప్పించారు. ఆ త‌ర్వాత‌ మూత్రం తాగించారు. అబ్బాయిలిద్దరూ సహాయం కోసం అరుస్తూ ఉన్నా.. వారికి సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.

ఆదివారం దుమారియాగంజ్‌కు చెందిన బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ బాలురు చికిత్స పొందుతున్న జిల్లా ఆసుపత్రికి వెళ్లారు. కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఎంపీ కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.





Tags:    

Similar News