Weather Report : వెదర్ అప్ డేట్.. ఏపీకి తప్పిన ముప్పు.. ఇక అంతా హ్యాపీస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. భారీవర్షం ముప్పు తప్పిందని పేర్కొంది

Update: 2024-12-22 03:43 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ కు వాయుగుండం ముప్పు తప్పిందని తెలిపింది. వాయుగుండం ప్రస్తుతం తీవ్ర అల్పపీడనగా మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తన దిశను మార్చుకుని అది ఈశాన్య దిశగా కదులుతూ తీరానికి దూరంగా వెళుతూ మరింత బలహీన పడుతుందని వాతావరణ శాఖ చెబుతుంది. ముందుగా అంచనా వేసినట్లుగా వాయుగుండంగా బలపడి అది ఆంధ్రప్రదేశ్ వైపునకు దూసుకువస్తుందన్న అంచనాలు విరమించుకున్నట్లు అధికారుల ప్రకటించారు. వాయుగుండం ముప్పు తప్పడంతో ప్రధానంగా ఏపీలో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లేకుంటే తమ ధాన్యం తడిసి ముద్దయిపోయే అవకాశముందని నిన్నటి వరకూ ఆందోళన చెందారు.

అల్పపీడనం ప్రభావంతో...
అయితే అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో కొన్ని చోట్ల మోస్తరుగాను, మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే మత్స్యకారులు ఈరోజు కూడా చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఈ అల్పపీడనం ప్రభావంతో తీరం వెంట గంటకు యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిసింది. రాబోయే మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలోనూ కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ప్రజలు వర్షాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
రైతులు జాగ్రత్తలు తీసుకుంటేనే...
మరోవైపు రైతులు మోస్తరు వర్షాలు పడుతుండటంతో తమ పంట ఉత్పత్తులు తడవకుండా దాచుకునేందుకు ముందు నుంచే ప్రయత్నాలు చేయాలని సూచిచింది. ఈ నెల 24, 25, 26 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ప్రధానంగా వరి, పొగాకు, పత్తి రైతులు వర్షానికి తడవకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరింది. ఇక మోస్తరు వర్షాల కారణంగా ఇరవై శాతం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. పంట కోతకు వచ్చే సమయం కావడంతో టార్పాలిన్ లను కూడా రైతులకు సరఫరా చేస్తామని, ధాన్యాన్ని వీలయినంత మేరకు గోదాములకు తరలించే ప్రయత్నం చేయాలని అధికారులు కోరుతున్నారు.



ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

 


Tags:    

Similar News