వైఎస్ వివేకా హత్య కేసు.. కడపలో రామ్‌సింగ్

వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ నిమిత్తం సీబీఐ అధికారి రామ్ సింగ్ కడపకు చేరుకున్నారు

Update: 2022-09-23 08:41 GMT

వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ నిమిత్తం సీబీఐ అధికారి రామ్ సింగ్ కడపకు చేరుకున్నారు. ఆరు నెలల తర్వాత ఆయన కడపకు వచ్చారు. వివేకానందరెడ్డి హత్య కేసు రామ్‌సింగ్ నేతృత్వంలోనే సీబీఐ బృందం విచారణ జరిపింది. అయితే ఆయన ఆరు నెలల నుంచి కడపకు రాలేదు. వివేకా హత్య కేసులో నిందితుడు గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డి తాను చెప్పినట్లు వాంగ్మూలం ఇవ్వాలటూ వత్తిడి తెచ్చారంటూ హైకోర్టును ఆశ్రయించారు.

ఆరు నెలల తర్వాత...
ఆ ఫిర్యాదు మేరకు రామ్‌సింగ్ పై స్థానిక పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. నిందితులపై బలవంతంగా వాంగ్మూలాలు సేకరించవద్దని హైకోర్టు కూడా తెలిపింది. దీంతో రాంసింగ్ అప్పటి నుంచి కడపకు రాలేదు. అయితే ఇటీవల సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ఎన్ని రోజులు ఈ విచారణ చేస్తారంటూ సీబీఐని ప్రశ్నిచింది. త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో రామ్‌సింగ్ కడపకు వచ్చారు. ఈరోజు కడపకు వచ్చిన రామ్‌సింగ్ ఈ హత్య కేసులో పలువురి అనుమానితులను విచారించే అవకాశముంది.


Tags:    

Similar News