సీబీఐ అధికారి అంటూ.. లక్షలు మాయం
సీబీఐ అధికారుల మంటూ సామాన్యులను మోసం చేస్తున్నారు.
సీబీఐ అధికారుల మంటూ సామాన్యులను మోసం చేస్తున్నారు. వాట్సప్ కాల్ లో సీబీఐ పేరున కాల్ చేస్తూ బెదిరించి భయపెట్టి మరీ అందిన కాడికి దోచుకునే ముఠా ఒకటి ఇటీవల కాలంలో ఎక్కవయింది. తాజాగా ఏలూరులో ఒక వ్యక్తి నుంచి సీబీఐ అధికారినంటూ లక్షల రూపాయలు కాజేసిన వైనం బయటకు వచ్చింది. ఏలూరు పట్టణంలోని విద్యానగర్ కు చెందిన పాము సెల్వా రోజ్లిన్ కు సీబీఐ అధకారినంటూ ఒక ఫోన్ వచ్చింది.
అపరిచిత వ్యక్తి నుంచి....
ఈ అపరిచిత వ్యక్తి నుండి ఈనెల 18న ఫోన్ కాల్ వచ్చింది. తాము సీబీఐ అధికారులమని, ముంబై నుండి ఫోన్ చేస్తున్నామని, తమ పేరిట కొరియర్ వచ్చిందని , దానిలో పరిశీలించగా.. డ్రగ్స్ ఉన్నాయని మీపై కేసు నమోదు చేస్తున్నామని వార్నింగ్ ఇచ్చారు. అనంతరం వీడియో కాల్ చేసి పార్సిల్ లోని వస్తువులు చూపించారు. మీపై కేసు నమోదు అయిందని, దాని నుండి బయట పడాలంటే డబ్బు చెల్లించాలని బెదిరించారు. దీంతో భయపడి వీరు అపరిచిత వ్యక్తి బ్యాంకు ఖాతాకు 25,60,500 రూపాయలు పంపారు. ఇది మోసం అని ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.