సొంత మామే ఇంతటి దారుణం చేశాడు
సంబంధించి ముగ్గురు అనుమానితుల్లో ఒకరిని పోలీసులు;

crime news
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో ఆరేళ్ల బాలికపై ఆమె 24 ఏళ్ల మామ అత్యాచారం చేసి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఆ మృతదేహాన్ని కారు ట్రంక్‌లో దాచిపెట్టి తాళం వేసి ఉంచారు. ఏప్రిల్ 5న మైనర్ అదృశ్యమైంది.
కన్యా భోజ్‌లో పాల్గొనడానికి ఆ చిన్నారి తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి ఆ తర్వాత తిరిగి రాలేదు. ఆమె కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుఎంతగానో వెతికింది. అయినా ఎలాంటి సమాచారం లభించలేదు. బాలిక అమ్మమ్మ ఆలయానికి వెళ్లగా, నిందితుడు సోమేశ్ యాదవ్, బాలిక మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఆ సమయంలో సోమేశ్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆపై చిన్నారిని హత్య చేసి పొరుగింటి వారి కారులో మృతదేహాన్ని పడేశాడు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు అనుమానితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కారులోంచి బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిన్నారి శరీరంపై గాయాలున్నాయని, ఆమెపై లైంగికదాడి జరిగినట్టు వైద్యులు నిర్ధారించారు. బాలిక మామను అరెస్ట్ చేశామని, నేరాన్ని అంగీరించాడని పోలీసులు తెలిపారు.