వైద్యుడి నిర్లక్ష్యం.. కుక్కకు ఆహారంగా పిండం

ఆమె ఆరోగ్యం మరింత విషమించడంతో పాట్నాకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. కాగా..

Update: 2023-01-21 12:05 GMT

doctor feeds foetus to dog

ఇటీవల కాలంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా.. గర్భిణులు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి ఘటనొకటి బీహార్ లో జరిగింది. వైద్యుడి నిర్లక్ష్యం వల్ల గర్భిణి మృతి చెందగా.. ఆమె కడుపులో ఉన్న పిండం.. కుక్కకు ఆహారమైంది. ఈ దారుణ ఘటన బీహార్ లోని హాజీపూర్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. బాలిగాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మహిళ గర్భందాల్చింది. ఇటీవలే ఆమెకు తీవ్రంగా కడుపునొప్పి రావడంతో.. వైద్యుడిని సంప్రదించింది. ఆమెను పరిశీలించిన అతడు.. మందులు రాసిచ్చాడు.

వైద్యుడిచ్చిన మందులు వాడిన ఆమె.. తీవ్ర అస్వస్థతకు గురైంది. దాంతో ఆమెకు అబార్షన్ చేశాడు వైద్యుడు. ఆమె ఆరోగ్యం మరింత విషమించడంతో పాట్నాకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. కాగా.. బాధితురాలికి అబార్షన్ చేసిన అనంతరం.. ఆ పిండాన్ని ఓ బకెట్ లో ఉంచాడు. ఆ పిండాన్ని త‌మ‌కు ఇవ్వాల‌ని, బాధితురాలి కుటుంబ స‌భ్యులు అడగ్గా వైద్యుడు నిరాక‌రించాడు. ఈ ఆధారం దొరికితే పోలీసులు మీపై, మాపై కేసులు న‌మోదు చేస్తార‌ని డాక్ట‌ర్లు చెప్పిన‌ట్లు బాధితురాలి కుటుంబ స‌భ్యులు పేర్కొన్నారు. ఆ పిండాన్ని సదరు వైద్యుడు తన పెంపుడు కుక్కకు ఆహారంగా పెట్టినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పిండాన్ని కుక్క‌కు ఆహారంగా పెట్టిన‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన విచార‌ణ‌లో తేల‌లేద‌ని పోలీసులు తెలిపారు. మ‌హిళ మృతికి కార‌ణ‌మైన వైద్యుడు, అత‌ని భార్య ప‌రారీలో ఉన్నారని, వారి ఆచూకీ కోసం వెతుకుతున్నామని పోలీసులు వెల్లడించారు.


Tags:    

Similar News