Road Accident : అనంతపురం జిల్లాలో లారీ - వ్యాన్ ఢీ ముగ్గురి మృతి
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు;

road accident in anantapur
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఆగి ఉన్న లారీని వ్యాన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా చెన్నంపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మంచు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
గాయపడిన వారిని...
వెంటనే పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.