పాము కాటుతో తండ్రి, కొడుకు మృతి

పాము కాటుతో తండ్రి, కొడుకు మృతి చెందిన సంఘటన పలువురిని కంటతడి పెట్టించింది.రాజం పేట మండలం శేర్ శంకర్..;

Update: 2023-07-22 05:44 GMT
Snake Bite, Share Shankar Tanda

Share Shankar Tanda

  • whatsapp icon

కామారెడ్డి జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పాము కాటుతో తండ్రి, కొడుకు మృతి చెందిన సంఘటన పలువురిని కంటతడి పెట్టించింది.రాజం పేట మండలం శేర్ శంకర్ తండా గ్రామ పంచాయతీ పరిధి లోని మూడు మామిళ్ల తండాకు చెందిన తండ్రి రవి (36), కొడుకు వీక్కు (11) ఇద్దరు రాత్రి ఇంట్లో పడుకున్న సమయంలో కొడుకు శరీరం బట్టల లోపల నుండి బయటకు పాము వస్తుండటాన్ని చూసిన తండ్రి హడలిపోయాడు. వెంటనే దానిని కొట్టేందుకు వెళ్లాడు.

దాంతో పాము ఒక్కసారిగా బుసలు కొడుతూ ఆగ్రహంతో తండ్రి కొడుకులను కాటేసింది. గమనించిన స్థానికులు వెంటనే తండ్రి కొడుకులను చికిత్స నిమిత్తం కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ తండ్రి, కొడుకులు మృతి చెందారు. పాముకాటుకు తండ్రి కొడుకులు మృతి చెందడంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News