పదో తరగతి విద్యార్థినీపై పలుమార్లు అత్యాచారం.. పోక్సో యాక్ట్
ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమె తోటి విద్యార్థులు ఇంట్లోకి చొరబడ్డారు. విద్యార్థినిపై బలాత్కారం చేశారు.
పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది. హయత్ నగర్ మండలం గడ్డిఅన్నారంలోని వైఎస్సార్ కాలనీలో తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది విద్యార్థిని. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమె తోటి విద్యార్థులు ఇంట్లోకి చొరబడ్డారు. విద్యార్థినిపై బలాత్కారం చేశారు. అదేదో ఘనకార్యమన్నట్టుగా వీడియోలు తీశారు. ఎవరికైనా చెబితే వీడియోలు బహిర్గతం చేస్తామని బెదిరించారు.
10రోజుల తర్వాత విద్యార్థినికి వీడియోలు చూపి మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. మళ్లీ వీడియోలు తీసి తమ స్నేహితులకు పంపారు. ఆలస్యంగా విషయాన్ని తెలుసుకున్న బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విద్యార్థిని చెప్పిన దానిప్రకారం ఐదుగురు విద్యార్థులకు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. బయటికి వెళ్తేనే కాదు.. ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు కూడా భద్రత ఉండటం లేదు.