వరుసగా పేలిన సిలిండర్లు

బీహార్ లోని భాగల్‌పూర్ లో వరసగా గ్యాస్ సిలిండర్లు పేలాయి. ట్రక్కు డ్రైవర్ మరణించాడు;

Update: 2022-12-14 05:38 GMT
gas cylinders, exploded, bihar
  • whatsapp icon

వరసగా గ్యాస్ సిలిండర్లు పేలడంతో భయానక వాతావరణం ఏర్పడింది. ఒకే సారి ముప్ఫయి నుంచి ముప్ఫయి ఐదు సిలిండర్లు పేలడంతో పెద్దయెత్తున శబ్దంతో పాటు మంటలు వ్యాపించాయి. బీహార్ లోని భాగల్‌పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక ట్రక్కులో లోడ్ చేసి ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలాయి.

ట్రక్కు డ్రైవర్ మృతి...
ఈ దుర్ఘటనలో ట్రక్కు డ్రైవర్ మృతి చెందాడు. వరసగా సిలెండర్లు పేలడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అర్థరాత్రి ఈ ఘటన జరగడంతో నిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కి పడి లేచి బయటకు పరుగులు తీశారు. గ్యాస్ సిలిండర్లు పేలిన స్థలానికి కొద్దిదూరంలోనే పెట్రోలు బంకు ఉంది. అయితే పెట్రోలు బంకు వరకూ మంటలు వ్యాపించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో చాలా సేపు ట్రాఫిక్ స్థంభించిపోయింది.


Tags:    

Similar News