గేట్ కాలేజీ యజమానిపై సుపారీ గ్యాంగ్ అటాక్

గేట్‌ కాలేజ్‌ ఓనర్‌ కాంతారావును చంపేందుకు సుపారీ గ్యాంగ్. గేట్ కాలేజీ యజమానిపై సుపారీ గ్యాంగ్ అటాక్

Update: 2023-06-22 14:29 GMT

తెలంగాణలో సుపారీ గ్యాంగ్ కలకలం మొదలైంది. కోదాడ గేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ఓనర్‌పై హత్యాయత్నం జరిగింది. కాంతారావు హత్య కోసం రూ.50 లక్షలు ఇచ్చి సుపారీ గ్యాంగ్‌ ను ఉసిగొల్పారు. కాంతారావు ప్రయాణిస్తున్న కారును డీసీఎం వ్యాన్‌తో ఢీకొట్టాలని ప్లాన్‌ చేసుకున్నారు. మునగాల మండలం మద్దెలచెరువు వద్ద కారును ఢీకొట్టేందుకు ప్రయత్నం చేశారు. సుపారీ గ్యాంగ్‌.. కోదాడలో కాంతారావు కారును డీసీఎంతో ఢీకొట్టడంతో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ క్రమంలో తేరుకున్న కాంతారావు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కోదాడ గేట్ ఇంజనీరింగ్ కాలేజీ ఓనర్ బుడ్డే కాంతారావును హత్య చేసేందుకు కాలేజీ భాగస్వాములు సుపారీ ఇచ్చారు. హత్య కోసం రూ.50 లక్షలు ఇచ్చేందుకు సుపారీ గ్యాంగ్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. గేట్ కాలేజీ భాగస్వాములు ముందుగా ఐదు లక్షల రూపాయలు చెల్లించారు. కాంతారావు ప్రయాణిస్తున్న కారును డీసీఎంతో ఢీ కొట్టాలని ప్లాన్ చేశారు. మద్దెల చెరువు వద్ద కాంతారావు కారును ఢీకొట్టేందుకు సిఫారీ గ్యాంగ్ యత్నించారు. కాంతారావు తప్పించుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత మరోసారి కోదాడ పట్టణంలో కాంతారావు కారును డీసీఎంతో ఢీకొట్టారు. అప్పుడు స్వల్ప గాయాలతో కాంతారావు బయటపడ్డారు. ఆ తర్వాత ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 12 మంది గ్యాంగ్ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.


Tags:    

Similar News