గూగుల్ ఆఫీస్ పై నుండి దూకి యువ టెక్కీ ఆత్మహత్య

నేలపై పడి ఉన్న అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. గూగుల్ కార్యాలయం 14వ..

Update: 2023-05-06 07:39 GMT

newyork google employee

గూగుల్ ప్రధాన కార్యాలయం పై నుండి దూకి యువ టెక్కీ ఆత్మహత్య చేసుకున్నాడు. న్యూయార్క్ నగరంలో ఈ ఘటన జరిగింది. సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్(31) 14వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గురువారం (మే 4) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గూగుల్ ప్రధాన కార్యాలయం వద్ద ఓ వ్యక్తి అచేతనంగా పడి ఉన్నాడని సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

నేలపై పడి ఉన్న అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. గూగుల్ కార్యాలయం 14వ అంతస్తు అంచుపై టెకీ చేతి వేలి ముద్రలు లభించడంతో అతడు బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే.. ఈ ఘటనపై గూగుల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. కొద్ది నెలల క్రితం కూడా ఓ గూగుల్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రాట్ (33) అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి తన అపార్ట్ మెంట్ లో ఉరి వేసుకున్నాడు. వరుసగా గూగుల్ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో.. అందుకు కారణం ఏమై ఉంటుందోనన్న చర్చ మొదలైంది.


Tags:    

Similar News