ప్రేమించిన మహిళను బ్లాక్ మెయిల్ చేసి.. 7 లక్షలు లాగేశాడు

Update: 2022-10-23 02:27 GMT

ప్రేమించిన మహిళను బ్లాక్ మెయిల్ చేసి.. వేధించి రూ.7 లక్షలు వసూలు చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె అనుమతి లేకుండా వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అప్‌లోడ్ చేసిన ఆమె చిత్రాలను తొలగించడానికి.. బదులుగా నిందితుడు మహిళ నుండి డబ్బు డిమాండ్ చేశాడు. నిందితుడిని బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన అన్షుల్ శ్రీవాస్తవగా గుర్తించారు. మహిళను పలు రకాలుగా బెదిరిస్తూ వచ్చాడు.. కాల్ చేయడం, ఇ-మెయిల్స్ పంపేవాడు.. ఆమె అనుమతి లేకుండా ఆమె చిత్రాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేసేవాడు. ఆమె మరెవరో కాదు అతడు ప్రేమించిన మహిళ. బ్లాక్‌మెయిల్ చేసి వేధించి రూ.7 లక్షలు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. చిత్రాలను తొలగించేందుకు రూ.7 లక్షలు ఇవ్వాలని బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేయగా, ఆ మహిళ భయంతో ఆ మొత్తాన్ని అతడి బ్యాంకు ఖాతాలో బదిలీ చేసింది. ఆ తర్వాత కూడా ఆ యువకుడు మరింత డబ్బును డిమాండ్ చేశాడు.

సెప్టెంబరు 12న ఆర్కే పురం మహిళ ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈమెయిళ్లు, మెసేజ్‌ల ద్వారా ఓ వ్యక్తి తనను నిరంతరం వేధిస్తున్నాడని, బెదిరిస్తున్నాడని, బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపింది. విచారణలో బాధితురాలు మొబైల్, ప్రాక్సీ నంబర్‌ల నుండి వచ్చిన బ్లాక్‌మెయిలింగ్ సందేశాలు, కాల్‌స్ వివరాలతో పాటు RTGS లావాదేవీల వివరాలను అందించింది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణ అనంతరం నిందితుడి ఆచూకీ కోసం దాడులు కూడా నిర్వహించారు. శుక్రవారం స్థానిక పోలీసు సిబ్బంది సహాయంతో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌కు చెందిన అన్షుల్ శ్రీవాస్తవ అనే నిందితుడిని పట్టుకోవడంలో తమ బృందం విజయం సాధించిందని డిసిపి సి మనోజ్ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ఒక మొబైల్ ఫోన్, రెండు సిమ్ కార్డులు, రెండు ఏటీఎం కార్డులు, ఒక బ్యాంక్ చెక్ బుక్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Tags:    

Similar News