నయనశ్రీ ప్రాణం తీసిన వేరుశనగ విత్తనం
శ్రీసత్యసాయి జిల్లాలో చిన్నారి ప్రాణాలను వేరుశెనగ విత్తనం తీసింది.
శ్రీసత్యసాయి జిల్లాలో చిన్నారి ప్రాణాలను వేరుశెనగ విత్తనం తీసింది. రెండేళ్ల చిన్నారి గొంతులో వేరుశనగ విత్తనం ఇరుక్కొని మృతి చెందింది. కర్నాటక రాష్ట్రం బాగేపల్లి ప్రాంతం వసంతపూర్ గ్రామానికి చెందిన హనుమంతు తన భార్య పిల్లలతో కలిసి నల్లచెరువులోని బంధువుల ఇంటికి వచ్చారు. హనుమంతు కూతురు నయనశ్రీ ఆడుకుంటూ వేరుశనగలు దగ్గరికి వెళ్లింది. వేరుశనగను గొంతులో పెట్టుకోవడంతో ఊపిరాడక కిందపడిపోయింది. వెంటనే బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఊహించని విధంగా చిన్నారి ప్రాణాలు పోవడం ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది.
హనుమంతు కూతురు నయనశ్రీ ఇంటి ముందు ఆడుకుంటుండగా వేరుశనగ విత్తనం గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక ఇబ్బంది పడింది. ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. చిన్నారి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.