భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త.. తృటిలో తప్పించుకున్న కొడుకు

ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో నాగరాజు కత్తితో భార్య సుధ గొంతుకోసి హతమార్చాడు. తల్లిపై దాడి చేస్తుండగా..

Update: 2023-05-20 12:08 GMT

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య గొంతుకోసి హతమార్చి.. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్ పల్లి మండలం జన్వాడ గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుడు నాగరాజు, సుధ దంపతులు ఐదునెలలుగా నివాసం ఉంటున్నారు. శుక్రవారం (మే20) రాత్రి ఏదో విషయమై భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది.

ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో నాగరాజు కత్తితో భార్య సుధ గొంతుకోసి హతమార్చాడు. తల్లిపై దాడి చేస్తుండగా.. అడ్డొచ్చిన పెద్ద కుమారుడు దీక్షిత్ (8) ను కూడా చంపేందుకు ప్రయత్నించగా.. అతను పరారయ్యాడు. భార్యను చంపిన అనంతరం నాగరాజు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు ఈ విషయం గమనించి పోలీసులకు సమాచారమివ్వగా.. ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు వివరాలు సేకరించారు. దంపతుల మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.


Tags:    

Similar News