అమెరికాలో తెలుగు విద్యార్థి బలవన్మరణం.. ట్రంప్ విధానంతోనేనా?
అమెరికాలోని న్యూయార్క్ లో తెలుగు విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు.;

అమెరికాలోని న్యూయార్క్ లో తెలుగు విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సాయికుమార్ రెడ్డి బలవన్మరణానికి పాల్పడటం వెనక ట్రంప్ తీసుకున్ననిర్ణయాలే కారణమని తెలుస్తోంది. చదువు కుంటూనే అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న సాయికుమార్ రెడ్డి గతకొద్ది రోజుల నుంచి ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఆ ఉద్యోగాన్ని మానేయాల్సి వచ్చింది.
ఆఫీసులోనే...
దీంతో తాను పనిచేస్తున్న ఆఫీసులోనే మరణించాడు. సాయికుమార్ రెడ్డి అమెరికా వెళ్లి ఉన్నత విద్యను అభ్యసిస్తూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. కానీ పార్ట్ టైం చేస్తున్న ఇతరదేశస్థులను అమెరికా నుంచి పంపించి వేస్తుండటంతో కలత చెంది తన కలలు నిజం కావేమోనని భావించి సాయికుమార్ రెడ్డి బలవన్మరణం పొందినట్లు అతని స్నేహితులు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ఎలా తెలియజేయాలో తెలియక స్నేహితులు ఇబ్బందులు పడుతున్నారు.