టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ: యువకుడు బలవన్మరణం

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ అవ్వడంతో ఒక యువకుడు బలవన్మరణం పొందని ఘటన సిరిసిల్లా జిల్లాలో జరిగింది

Update: 2023-03-18 07:30 GMT

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ అవ్వడంతో ఒక యువకుడు బలవన్మరణం పొందని ఘటన సిరిసిల్లా జిల్లాలో జరిగింది. జిల్లాలోని బి.వై.నగర్ కు చెందిన నవీన్ కుమార్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్న లక్ష్యంతో ఆయన గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో నవీన్ కుమార్ మనస్థాపానికి గురయ్యాడు. ఆందోళన చెంది బలవన్మరణం పొందారని కుటుంబ సభ్యులు తెలిపారు. బివై నగర్ కు చెందిన చిటికెన నాగభూషణం, సుశీల దంపతుల ముగ్గురు కుమారుల్లో నవీన్ కుమార్ ఒకరు.

మంత్రి కేటీఆర్ ఫోన్....
నవీన్ మరణిస్తూ లేఖ కూడా రాశారు. ‘అన్ సాటిస్ఫైడ్ లైఫ్.. నో వన్ ఇస్ రీజన్ ఫర్ దిస్… ఐ యాం యూస్ లెస్ ఫర్ ఆల్ జాబ్ లెస్.. థాంక్యూ టు మై ఫ్యామిలీ… ఐ క్విట్స్‌’’ అంటూ నవీన్ కుమార్ రాసిన లేఖ బయటపడటంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు బోరున విలపిస్తున్నారు. విషయం తెలిసిన మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అధైర్యపడవద్దని తండ్రి నాగభూషణానికి కేటీఆర్ తెలిపారు.


Tags:    

Similar News