లోన్ యాప్ వేధింపులకు మరొకరు బలి

లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక యువకుడు బలవన్మరణం పొందిన ఘటన హనుమాన్ జంక్షన్ లో జరిగింది;

Update: 2023-01-06 07:35 GMT
లోన్ యాప్ వేధింపులకు మరొకరు బలి
  • whatsapp icon

లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక యువకుడు బలవన్మరణం పొందిన ఘటన హనుమాన్ జంక్షన్ లో జరిగింది. క్రికెట్ బుకీల వేధింపులు కూడా ఇందుకు కారణమని చెబుతున్నారు. లోన్ యాప్ ద్వారా డబ్బులు తీసుకున్న వేలేరు గ్రామానికి చెందిన రోహిత్ అనే యువకుడు బలవన్మరణం పొందారు.

వేధింపులు తాళలేకనే....
వేధింపులు తాళలేకనే బలవన్మరణానికి పాల్పడ్డారని సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బెట్టింగ్ మాఫియా ఆగడాలు కూడా ఇందుకు కారణమని చెబుతన్నారు. బలవన్మరణానికి పాల్పడిన రోహిత్ పిన్నమనేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News