నగదు కాదు.. టోకెన్లేనట
పన్నులు చెల్లించకుండా హవాలా మార్గం ద్వారా చీకోటి ప్రవీణ్ టోకెన్లు వినియోగించేవారని దర్యాప్తు లో వెల్లడయినట్లు సమాచారం.
క్యాసినో వ్యవహారంలో చీకోటి ప్రవీణ్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విచారణ చేశారు. చీకోటి ప్రవీణ్ తో పాటు మాధవరెడ్డిని కూడా విచారించారు. చీకోటి ప్రవీణ్ ల్యాప్‌ట్యాప్, ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు మనీలాండరింగ్ జరగిందా? లేదా? అన్న దానిపై విచారణ చేస్తున్నారు. పన్నులు చెల్లించకుండా హవాలా మార్గం ద్వారా ప్రవీణ్ టోకెన్లు వినియోగించేవారని దర్యాప్తు లో వెల్లడయినట్లు సమాచారం. ఎంత మందిని ఇతర దేశాలకు తీసుకెళ్లారు? ఎంత మొత్తంలో నగదును దేశం దాటించారన్న దానిపై విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. వీరి పేరిట విదేశీ బ్యాంకుల ఖాతాలు ఏమైనా ఉన్నాయా? ఫెమా ఉల్లంఘన జరిగిందా? అన్న దానిపై కూడా విచారణ జరుగుతుంది.
ఫెమా నిబంధనలను....
అనేక మంది పారిశ్రామికవేత్తలు, ప్రముఖులకు చీకోటీ ప్రవీణ్ తో సంబంధాలున్నాయని గుర్తించారు. ఇందులో రాజకీయ నేతలు కూడా ఉన్నారు. అతను గత కొద్ది నెలలుగా చేస్తున్న నగదు లావాదేవీలపై కూడా ఈడీ దృష్టి పెట్టింది. క్యాసినోలో డ్యాన్స్ లు చేయించేందుకు బాలివుడ్ తారలను ఎంతమందిని తీసుకొచ్చారు? వారికి ఎంత నగదును పేమెంట్ చేశారు? ఎలా చేశారు? అన్న దానిపై కూడా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. నిన్న పూర్తి స్థాయిలో విచారించిన ఈడీ అధికారులు నేడు మరోసారి కీలక అంశాలపై విచారణ చేస్తున్నారు.