గాఢంగా ప్రేమించుకున్నారు.. కట్ చేస్తే గోనెసంచిలో డెడ్ బాడీ ?

విజయపురా జిల్లా హదరిహల్ కు చెందిన భీమన్న డిగ్రీ చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి ఇంటర్;

Update: 2022-10-16 10:36 GMT
karnataka honor killing, vijayapura district, intercaste love

karnataka honor killing

  • whatsapp icon

వారిద్దరూ ఒకే ప్రాంతానికి చెందినవారు. ఇద్దరి మధ్యనున్న స్నేహం ప్రేమగా మారింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత గాఢంగా మారింది. విషయం తల్లిదండ్రుల దృష్టికి చేరింది. పద్ధతి మార్చుకోవాలని, దూరంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. కొద్దిరోజులు దూరంగా ఉండేందుకు ప్రయత్నించారు. కానీ.. ఆ ఎడబాటును భరించలేక, పెద్దలను ఒప్పించలేక ఇంట్లో నుంచి పారిపోయారు. కానీ ఇద్దరి కులాలు వేరు కావడం వారి ప్రేమకు శాపమైంది. కొద్దిరోజులకే యువకుడి మృతదేహం కుళ్లిన స్థితిలో లభ్యమవ్వడం సంచలనంగా మారింది. ఈ ఘటన కర్ణాటకలోని విజయపురా జిల్లాలో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే.. విజయపురా జిల్లా హదరిహల్ కు చెందిన భీమన్న డిగ్రీ చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి స్నేహంగా.. ఆపై ప్రేమగా మారింది. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు వారిని మందలించారు. ఇంకెప్పుడూ కలుసుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. యువతిని కాలేజీ కూడా మాన్పించారు. ఎడబాటు తట్టుకోలేక సెప్టెంబర్ 20న ఇద్దరూ ఊరి నుంచి పారిపోయారు. వారి కోసం ఊరంతా వెతికారు. తెలిసిన వారివద్ద ఆరా తీశారు. అయినా ఆచూకి లేకపోవడంతో టికోటా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
విజయపురా జిల్లా హదరిహల్ కు చెందిన భీమన్న డిగ్రీ చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి ఇంటర్కట్ చేస్తే.. అక్టోబర్ 10వ తేదీన బిలగిలోని కృష్ణానది ఒడ్డున ఓ గోనెసంచిలో కుళ్లిన స్థితిలో ఓ మృతదేహం లభ్యమైంది. మృతుడు వేసుకున్న టీ-షర్ట్​ ఆధారంగా అతను భీమన్న అని గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా.. యువతి తండ్రే కూతురికి, యువకుడికి విషమిచ్చి హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. యువతి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఈ కేసులు యువతి తండ్రి సహా ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్పీ కుమార్ తెలిపారు.


Tags:    

Similar News