బస్సులోనే ఉరేసుకున్న కండక్టర్

డిపో లోపలికి వెళ్లిన మహేందర్ ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో.. అనుమానం వచ్చి సెక్యూరిటీ గార్డ్ డిపో మొత్తం గాలించారు.

Update: 2023-03-13 12:12 GMT

mahabubnagar conductor suicide

ఏం కష్టమొచ్చిందో ఏమో పాపం.. విధుల్లోకి వచ్చిన ఓ కండక్టర్ బస్సులోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహబూబ్ నగర్ జిల్లా తొర్రూర్ లో ఈ విషాద ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తొర్రూర్ మండలం కంఠాయపాలెం గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి తొర్రూర్ ఆర్టీసీ బస్ డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్నాడు. ఆదివారం(మార్చి12) యథావిధిగా విధులకు హాజరయ్యేందుకు వచ్చి, రిజిస్టర్ లో సంతకం చేసి డిపోలోకి వెళ్లారు.

డిపో లోపలికి వెళ్లిన మహేందర్ ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో.. అనుమానం వచ్చి సెక్యూరిటీ గార్డ్ డిపో మొత్తం గాలించారు. ఈ క్రమంలోనే ఓ ఆర్టీసీ బస్సులో ఆయన విగతజీవుడై కనిపించాడు. వెంటనే సిబ్బంది అధికారులకు సమాచారమివ్వగా, వారు పోలీసులకు విషయం చెప్పారు. ఘటనా ప్రాంతానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు పంపి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా.. మహేందర్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. విధుల్లో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారా? లేక వ్యక్తితగ కారణాలతో బలవన్మరణానికి పాల్పడ్డారా? అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది.


Tags:    

Similar News