యాలాలలో దారుణం.. పదో తరగతి విద్యార్థినిపై కారులో అత్యాచారం

విద్యార్థిని చదువుతున్న పాఠశాల హెడ్ మాస్టర్ వెంకటయ్య విద్యార్థులందరినీ హైదరాబాద్ కు..;

Update: 2023-02-22 13:24 GMT
yalala school student assault

yalala school student assault

  • whatsapp icon

వికారాబాద్ జిల్లా యాలాలలో దారుణ ఘటన జరిగింది. ఇంటి వద్ద జాగ్రత్తగా దింపాల్సిన 10వ తరగతి బాలికను కిడ్నాప్ చేసి, ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడో యువకుడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థిని చదువుతున్న పాఠశాల హెడ్ మాస్టర్ వెంకటయ్య విద్యార్థులందరినీ హైదరాబాద్ కు విహారయాత్రకు తీసుకొచ్చారు. తిరిగి స్కూల్ కు చేరుకునేసరికి అర్థరాత్రి అయింది. అందరి విద్యార్థులను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు వచ్చారు.

కానీ.. బాధిత బాలిక తల్లిదండ్రులు విద్యార్థినిని తీసుకెళ్లేందుకు రాలేదు. ఆలస్యమవుతుండటంతో.. హెడ్ మాస్టర్ రఘుపతి అనే యువకుడికి బాలికను అప్పగించి జాగ్రత్తగా ఇంటివద్ద దింపాలని సూచించారు. తన కామవాంఛ తీర్చుకునేందుకు అదే అదనుగా భావించిన రఘుపతి.. బాలికను కారులో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆ తర్వా ఏమీ తెలియనట్టు ఇంటివద్ద దింపేశాడు. 2 రోజుల తర్వాత తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు యాలాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితుడు రఘుపతిని అరెస్ట్ చేశారు. బాలిక విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెడ్ మాస్టర్ వెంకటయ్యను జిల్లా కలెకటర్ సస్పెండ్ చేశారు.


Tags:    

Similar News