శ్రద్ధ హత్య ఘటన మరువకముందే.. మధ్యప్రదేశ్ లో మరో యువతి దారుణ హత్య

అనంతరం ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో అప్‌లోడ్ చేశాడు. శిల్ప తనను మోసం చేసినందుకుగాను ఈ హత్య చేసినట్లు ..;

Update: 2022-11-16 13:05 GMT
shradha walkar murder, madhya pradesh crime

shradha walkar murder case

  • whatsapp icon

దేశరాజధానిలో శ్రద్ధా వాకర్ అనే యువతి హత్య ఘటన మరువక ముందే.. మరో దుర్మార్గుడు తన ప్రియురాలిని దారుణంగా హతమార్చిన ఘటన మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ జిల్లాలో జరిగింది. తాజాగా ఈ ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. అభిజిత్ పాటిదార్, శిల్పా మిశ్రా అనే యువతి కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. ఈ క్రమంలో నవంబర్ 6న శిల్ప ను అభిజిత్.. జబల్ పూర్ జిల్లా, కుందం ప్రాంతంలోని మేఖ్లా రిసార్ట్ కు తీసుకెళ్లాడు. అదే రోజు రిసార్ట్ గదిలో అభిజిత్.. ఆమె గొంతు, చేయి కోసేశాడు. తీవ్రరక్తస్రావంతో శిల్ప అక్కడే మరణించింది. అనంతరం ఆమె మృతదేహంతో అభిజిత్ సెల్ఫీ వీడియో తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు.

అనంతరం ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో అప్‌లోడ్ చేశాడు. శిల్ప తనను మోసం చేసినందుకుగాను ఈ హత్య చేసినట్లు వీడియోలో చెప్పాడు. అవసరమైతే తనను పట్టుకోమంటూ పోలీసులకు సవాల్ విసిరాడు. నవంబర్ 8 వరకు గదిలోనుండి ఎవరూ బయటికి రాకపోవడం, లోపలి నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో రిసార్ట్ సిబ్బందికి అనుమానమొచ్చి ప్రత్యేక కీ తో గది తలుపులు తెరిచి చూశారు. లోపల శిల్ప చనిపోయి ఉండటంతో.. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. తర్వాత పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం అభిజిత్ పరారీలో ఉండగా.. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.


Tags:    

Similar News