58 ఏళ్ల వ్యక్తి.. మొబైల్ తో పాడు పనులు.. అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

వాట్సాప్‌లో అనుచిత, అవమానకరమైన వ్యాఖ్యలు పంపుతూ తన బంధువును వేధించిన వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు

Update: 2022-07-06 14:50 GMT

వేర్వేరు ఫోన్ నెంబ‌ర్ల నుంచి మ‌హిళ‌కు అశ్లీల వీడియోలు పంపిన 58 సంవత్సరాల వ్య‌క్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని హైద‌రాబాద్ బ‌జార్ఘాట్ ప్రాంతానికి చెందిన రైజుద్దీన్‌గా గుర్తించారు. నిందితుడిని షీటీమ్స్ బృందం అదుపులోకి తీసుకుంది. రైజుద్దీన్ గ‌త కొంత‌కాలంగా ఫేస్‌బుక్ ఖాతాలో మ‌హిళ‌ల ఐడీల‌ను గుర్తించి టార్గెట్‌గా ఎంపిక చేసుకున్న వారి ఫోన్ నెంబ‌ర్ల‌ను సేక‌రిస్తూ వచ్చాడు. ఆ తర్వాత వారికి అశ్లీల వీడియోల‌ను షేర్ చేస్తూ వచ్చాడు. గ‌త కొద్దినెలలుగా నిందితుడు మూడు వేర్వేరు నెంబ‌ర్ల నుంచి ఐదుగురికి పైగా మ‌హిళ‌ల‌కు అశ్లీల వీడియోలు పంపుతున్న‌ట్టు ద‌ర్యాప్తులో తేలింద‌ని షీటీమ్స్ అధికారులు తెలిపారు. బాధితులు నిందితుడిని నెంబ‌ర్‌ను బ్లాక్ చేస్తే మ‌రో నెంబ‌ర్ నుంచి వీడియోల‌ను పంపుతూ వేధింపుల‌కు గురిచేస్తున్నాడ‌ని తెలిపారు. ఓ బాధితురాలు షీ టీంను ఆశ్ర‌యించ‌డంతో ఆ వ్యక్తి చేస్తున్న పాడు పనులు బయటకు వచ్చాయి. బోయిన్‌ప‌ల్లి పోలీసులు నిందితుడిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. నిందితుడు రైజుద్దీన్‌ను అరెస్ట్ చేసిన షీటీమ్స్ బృందం త‌దుప‌రి ద‌ర్యాప్తు నిమిత్తం బోయిన్‌ప‌ల్లి పోలీసుల‌కు అప్ప‌గించింది.

కజిన్ ను ఏడిపిస్తూ:
వాట్సాప్‌లో అనుచిత, అవమానకరమైన వ్యాఖ్యలు పంపుతూ తన బంధువును వేధించిన వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం ఇక్కడ అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తి రంగారెడ్డి జిల్లా యాచారంకు చెందిన వి చంద్ర శేఖర్ (28) అనే భవన నిర్మాణ కార్మికుడు. అసభ్యకర వీడియోలు చూసే అలవాటు ఉన్న చంద్ర శేఖర్ కొత్త సిమ్ కార్డును సంపాదించి నకిలీ వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసి దాని ద్వారా పోర్న్ వీడియోల లింక్‌లను తన బంధువుకు పంపి మానసిక వేదనకు గురిచేశాడని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.


Tags:    

Similar News