Breaking : అనంతపురంలో ఎన్ఐఏ సోదాలు
అనంతపురం జిల్లాలో రాయదుర్గంలో నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ తనఖీలు నిర్వహిస్తుంది;

NIA conducted raids in four states of the country
అనంతపురం జిల్లాలో రాయదుర్గంలో నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ తనఖీలు నిర్వహిస్తుంది. దీంతో పట్టణంలో ఒకింత కలకలం రేగింది. రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఏం జరుగుతుందో అర్ధం కాక ప్రజలు ఆందోళనలో ఉన్నారు. అనంతపురంలో ఎన్ఐఏ అధికారుల సోదాలు హాట్ టాపిక్ గా మారింది.
ఉగ్రవాదులతో...
పదవి విరమణ చేసిన హెడ్ మాస్టర్ అబ్దుల్ నివాసంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. అయితే అబ్దుల్ కుమారులు బెంగళూరులో నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా అబ్దుల్ కుమారులు కనిపించని కారణంతో పాటు, ఉగ్రవాదులతో లింకులపై ఎన్ ఐ ఏ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అనంతపురంలోని నాగుల బావిలోని తండ్రి అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది.