NIA : ఎన్ఐఏ సోదాలు.. నాలుగు రాష్ట్రాల్లో.. కీలక సమాచారం మేరకు
నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు దాడులు చేస్తున్నారు. దేశంలో నాలుగు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు దాడులు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాద కుట్ర కోణంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈరోజు ఉదయం నుంచే సోదాలు ప్రారంభమయ్యాయి. కర్ణాటక, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీలలో ఈ సోదాలు జరుపుతున్నారు. బృందాలుగా విడిపోయి ఏకకాలంలో ఈ సోదాలు జరుపుతున్నారని సమాచారం.
ఉగ్రవాద కుట్ర కేసులో...
డిసెంబరు 18 ఉగ్రవాద కుట్ర కేసులో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ప్రాధమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా దాడులకు తెగబడేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం అందడంతో ఈ దాడులు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం దాడులు జరిపి పదిహేను మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ దాడులకు కుట్ర పన్నిందని ఎన్ఐఏ అధికారులు అనుమానించి ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.