వీళ్లు లవర్స్ కాదు.. భార్యాభర్తలు..అరెస్ట్ చేసిన పోలీసులు

నల్లగొండ జిల్లాలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న జంటను పోటీసులు అరెస్ట్ చేశారు.

Update: 2024-01-13 05:16 GMT

నల్లగొండ జిల్లాలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న జంటను పోటీసులు అరెస్ట్ చేశారు. అయితే వారు లవర్స్ కాదని భార్యాభర్తని పోలీసులు తెలిపారు. నల్లగొండ జిల్లా మర్రిగూడెంలో సునీత అనే మహిళకు లిఫ్ట్‌ ఇచ్చి మరీ ఏడు తులాల మంగళసూత్రాన్ని లాక్కుని ఈ జంట పారిపోయింది. వీరి కోసం నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

హైదరాబాద్ పారిపోగా...
అయితే వీరిని లవర్స్‌గా పోలీసులు అనుమానించారు. కానీ విచారణలో మాత్రం భార్యాభర్తలుగా తేలింది. ఇక్కడ చోరీ చేసి హైదరాబాద్ పారిపోయారు. దంతో సంతోష్‌నగర్ వద్ద పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన వారు ఇద్దరూ వెంకటేష్ అతని భార్యగా గుర్తించారు. వ్యసనాలకు అలవాటు అయి వీరిద్దరూ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లుపోలీసులు తెలిపారు.


Tags:    

Similar News