నలుగురు మృతికి కారణమైన కారుపై ఆరు చలాన్లు

కరీంనగర్ లో ప్రమాదానికి గురైన కారు యజమాని రాజేంద్ర ప్రసాద్ ది గా పోలీసులు గుర్తించారు;

Update: 2022-01-30 03:43 GMT
car accident, vardhan, rajendra prasad, kaeemnagar
  • whatsapp icon

కరీంనగర్ లో ప్రమాదానికి గురైన కారు యజమాని రాజేంద్ర ప్రసాద్ ది గా పోలీసులు గుర్తించారు. కారు యజమాని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కరీంనగర్ లో ఈరోజు కారు ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి చెందిన సంగతి తెలిసిందే. రోడ్డుపక్కన ఉన్న గుడెసె లోకి వేగంగా వస్తున్న కారు దూసుకు పోవడంతో ఆ ప్రమాదం జరిగింది.

ఆరు చలాన్లు...
అయితే ఈ కారులో ఉన్న నలుగురు ప్రమాదం జరిగిన వెంటనే పరారయ్యారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కారుపై ఇప్పటికే ఆరు చలాన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కారు యజమాని రాజేంద్ర ప్రసాద్ కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.


Tags:    

Similar News