డూప్లికేట్ యోగి ని చంపేశారు

అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ను టార్గెట్ చేస్తూ చురకలు అంటించేవారు. డూప్లికేట్ యోగి గా యూపీలో

Update: 2023-08-12 02:04 GMT

'డూప్లికేట్ యోగి'గా పేరుగాంచిన సురేష్ కుమార్ యోద్ధ దారుణ హత్యకు గురయ్యారు. సమాజ్‌వాదీ పార్టీకి ప్రముఖ ప్రచారకర్తగా ఎన్నికల్లో పని చేశారు సురేష్. అతడి మరణ వార్తలను ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఇటీవల ఒక ట్వీట్‌లో పంచుకున్నారు. సురేష్ ఉన్నావ్ జిల్లాకు చెందినవారు.. పార్టీ ప్రచారానికి తనవంతు సాయం చేశారు. సురేష్ మృతి వార్త తెలియగానే ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీకి ప్రచారకర్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సురేశ్ ను నిర్దాక్షిణ్యంగా హత్య చేయడం ఎంతో బాధిస్తోందని అన్నారు. దోషులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు. సురేష్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సురేశ్ మరణవార్త తెలియగానే, సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుని సంతాపం తెలియజేసి నివాళులర్పించారు.

సురేష్ కుమార్ భార్య మాట్లాడుతూ.. తన భర్తపై దాడి జరిగిన తర్వాత తాను సోహరామౌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, అయితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. నిందితులతో పోలీసులకు సంబంధాలున్నాయని ఆమె ఆరోపణలు చేశారు. న్యాయం కోసం ఎంతో పోరాటం చేశానని కానీ ప్రయోజనం దక్కలేదని అన్నారు. సురేష్ కుమార్ ఉన్నావ్‌లోని సోహరమావు పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌపాయ్ గ్రామానికి చెందినవాడు. గత నెల జూలై 28న సురేష్‌ను అతని ఇద్దరు సోదరులు దారుణంగా కొట్టారని అతని భార్య వెల్లడించింది. దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు, ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించాడు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో, అఖిలేష్ యాదవ్‌తో సురేష్ కుమార్ యోధా విమానంలో కలిసి భోజనం చేస్తూ కనిపించారు. అఖిలేష్ యాదవ్ ప్రచారంలో సురేశ్ తరచుగా కనిపించేవారు. సురేశ్ ద్వారా అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ను టార్గెట్ చేస్తూ చురకలు అంటించేవారు. డూప్లికేట్ యోగి గా యూపీలో బాగా ఫేమస్ అయ్యాడు.



Tags:    

Similar News