ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

విజయనగరం జిల్లా భోగాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మరణించారు.;

Update: 2024-11-30 06:28 GMT

విజయనగరం జిల్లా భోగాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మరణించారు. భోగాపురం మండలం పోలిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఈరోజు కారు అదుపు తప్పింది. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వస్తున్న కారు ప్రమాదానికి గురయింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మరణించారు. కారు డివైడర్ ను ఢీకొట్టి బోల్తా కొ్టి పక్క రోడ్డుపైన పడింది.

లారీ ఢీకొట్టడంతో...
అటుగా వస్తున్న లారీ కారును ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు ప్రాణాలు కోల్పోగా, లారీ డ్రైవర్ కు గాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలిసింది.


Tags:    

Similar News