స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ.. జిల్లా కలెక్టర్ కు కేటీఆర్ ఫోన్

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, యువకులు గాయపడిన విద్యార్థులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం..;

Update: 2023-01-31 07:53 GMT
school bus accident, rajanna sircilla district

school bus accident

  • whatsapp icon

స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో.. 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదం తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులున్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, యువకులు గాయపడిన విద్యార్థులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, యాజమాన్యం హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.

ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను, ప్రమాదానికి గల కారణాలను జిల్లా కలెక్టర్ డీఈఓను అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు జిల్లా మంత్రి కేటీఆర్ .. సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ , బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో ఫోన్​లో మాట్లాడి విద్యార్థుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, అవసరమైతే హైదరాబాద్ కు తరలించాలని సూచించారు.


Tags:    

Similar News