మేడారం వెళుతుండగా ప్రమాదం

మేడారం జాతరకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.;

Update: 2024-02-21 05:13 GMT
rtc bus, lorry, medaram jathara,
  • whatsapp icon

మేడారం జాతరకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈరోజు ఉదయం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కాటారం - భూపాలపల్లి రహదారిపై మేడిపల్లి అటవీ ప్రాంతంలో మంచిర్యాల నుంచి మేడారం వెళుతున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. బస్సు నుంచి కొందరు దూకేందుకు ప్రయత్నించారు.

గాయాలు కావడంతో...
ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు తీవ్రగాయాలు పాలుకాగా, అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ తో పాటు పలువురు ప్రయాణికులకు కూడా గాయలయ్యాయి. ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో యాభై మంది వరకూ ప్రయాణికులున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News