Road Accident : వేగంగా వచ్చిన లారీ బస్సు ఢీకొనడంతో.. ఆరుగురు మృతి

వేగంగా వెళుతున్న లారీ బస్సును ఢీకొట్టడంతో ఆరుగురు మరణించారు;

Update: 2024-04-29 01:24 GMT
Road Accident : వేగంగా వచ్చిన లారీ బస్సు ఢీకొనడంతో.. ఆరుగురు మృతి
  • whatsapp icon

వేగంగా వెళుతున్న లారీ బస్సును ఢీకొట్టడంతో ఆరుగురు మరణించారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నవ్ జిల్లాలోజరిగింది. ఈ ఘటనలో ఇరవై మందికి పైగా గాయపడ్డారు. సఫీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్దోయ్ - ఉన్నవాీవ్ రహదారిపై జమాల్దీపూర్ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే పరారు కాగా, లారీ డ్రైవర్ ను మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

అతి వేగమే...
క్షతగాత్రులను సమీపంలోని కాన్పూరు ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థిితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈప్రమాదంలో స్వల్ప గాయాలయిన వారిని ఉన్నవ్ జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. వారికి ప్రాధమిక చికిత్స చేసిన అనంతరం పంపారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతి వేగం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు.


Tags:    

Similar News