ఆన్ లైన్ గేమ్ లకు అలవాటు పడి అప్పులపాలై సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆన్ లైన్ గేమ్‌లకు అలవాటు పడి దానిని వ్యసనంగా మార్చుకుని అప్పులపాలై చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు;
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆన్ లైన్ గేమ్‌లకు అలవాటు పడి దానిని వ్యసనంగా మార్చుకుని అప్పులపాలై చివరకు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఒక కుటుంబంలో విషాదం నింపింది. కరీంనగర్ జిల్లాకు చెందిన గంగాధరలోని మధురానగర్ లోని పృథ్వీ ఏడాది క్రితం హైదరాబాద్ లో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరాడు. అయితే విధుల కోసం నోయిడాకు వెళ్లాలని సూచించగా అక్కడకు వెళ్లాడు.
నోయిడాలోని గదిలో...
అక్కడ స్నేహితులతో కలసి గదిలో ఉన్న పృథ్వీ ఆన్ లైన్ గేమ్ లకు అలవాటుపడ్డాడు. ఆన్ లైన్ గేమ్ ల కోసం పన్నెండు లక్షల రూపాయలను అప్పు చేశాడు. స్నేహితుల వద్ద తీసుకున్నాడు. అంతా ఆన్ లైన్ గేమ్ లో పోగొట్టుకున్నాడు. అప్పులు చెల్లించాల్సి రావడం, ఒత్తిడి పెరగడం, ఎలా చెల్లించాలో తెలియకపోవడంతో ఆందోళనకు గురైన పృధ్వీ గదిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. నోయిడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.