చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్న శ్వేత చౌదరి

శ్వేత‌ గ‌త మూడు నెల‌లుగా ఇంటి నుంచే ప‌ని చేస్తోంది. మ‌రో కంపెనీలో ఉద్యోగం వ‌చ్చింది. ఆదివారం కొత్త ఉద్యోగంలో జాయిన్ కావాల్సి ఉంది.

Update: 2022-07-03 12:44 GMT

కృష్ణా జిల్లా మంగళగిరి మండలం నువులూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ శ్వేత చౌదరి ఆత్మహత్య చేసుకుంది . ఆమె వయసు 22 సంవత్సరాలు. మూడు నెలల నుంచి వర్క్‌ప్రమ్‌ హోం ద్వారా ఉద్యోగం చేస్తోంది. ఆమె ఇక హైదరాబాద్‌ లో కంపెనీలో విధుల్లో చేరాల్సి ఉండగా.. ఈ దారుణానికి పాల్పడింది. నిన్న సాయంత్రం ఇంటి నుంచి బయలు దేరిన ఆమె.. జగ్గయ్యపేట పరిధిలో చిల్లపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానని రాత్రి 8 గంటలకు తల్లిదండ్రులకు వాట్సాప్‌ మెసేజ్‌ పంపింది. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈరోజు మృతదేహాన్ని బయటకు తీసి శవ పంచనామ నిమిత్తం మృతదేహాన్ని జగ్గయ్యపేట ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.

శ్వేత‌ గ‌త మూడు నెల‌లుగా ఇంటి నుంచే ప‌ని చేస్తోంది. మ‌రో కంపెనీలో ఉద్యోగం వ‌చ్చింది. ఆదివారం కొత్త ఉద్యోగంలో జాయిన్ కావాల్సి ఉంది. ఈ క్ర‌మంలో శ‌నివారం సాయంత్రం 5 గంట‌ల‌కు ఇంటి నుంచి బ‌య‌లుదేరింది. రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో తాను డిప్రెషన్ లో ఉన్నానని, ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్లు వాట్సాప్‌లో త‌ల్లికి మెసేజ్ పంపింది.


Tags:    

Similar News