ఘోరం.. తల్లి ప్రియుడిని హతమార్చిన కొడుకు
తల్జారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడా జమ్నివర్ తోలాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మదన్ సోరెన్ అనే వ్యక్తి గ్రామ పెద్ద అయిన లఖన్;
ఇటీవల కాలంలో అక్రమ సంబంధాలు కొనసాగించే వారికి సంఖ్య పెరుగుతోంది. వాటిని సహించలేక.. కుటుంబ సభ్యులే వారిని కడతేర్చే ఘటనలూ పెరుగుతున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో మరోవ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న తల్లిని పిల్లలు కడతేర్చిన ఘటన మరువక ముందే.. ఝార్ఖండ్ లో మరో ఘోరం జరిగింది. తమ ఇంట్లో బాయ్ ఫ్రెండ్ తో ఇష్టంలేని పనులు చేస్తున్న తల్లిని చూసిన కొడుకు కోపోద్రిక్తుడై అతడిని దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్రకలకలం రేపింది. నిందితుడు రాజన్ మరాండీ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
తల్జారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడా జమ్నివర్ తోలాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మదన్ సోరెన్ అనే వ్యక్తి గ్రామ పెద్ద అయిన లఖన్ సోరెన్ కు వరుసకు బావ. పనికోసం కొద్దిరోజులుగా గ్రామంలోనే ఉంటున్నాడు. ఆ సమయంలోనే ఆ గ్రామానికి చెందిన రైలా మరాండి భార్యను కలిశాడు. వారిద్దరి పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. ఆ విషయం గ్రామమంతా తెలిసింది. ఈ వ్యవహారాన్ని సదరు మహిళ కుటుంబీకులు వ్యతిరేకించారు. అయినా సరే వారిద్దరూ కలవడం మానలేదు.
ఈ వ్యవహారం ఆ మహిళ కొడుకైన రాజన్ మరాండీకి కోపం తెప్పించింది. మంగళవారం (మార్చి21) కూడా ఇంట్లో.. తన తల్లితో అతను ఏకాంతంగా ఉండటం చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కోపం పట్టలేక మదన్ సోరెన్ ను దారుణంగా హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రాజన్ ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు.