బాలిక ఆత్మహత్య కేసులో టీడీపీ నేత అరెస్ట్

విజయవాడలో బాలిక ఆత్మహత్య కేసులో టీడీపీ నేత వినోద్ కుమార్ జైన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు;

Update: 2022-01-30 07:07 GMT
traffic restrictions, tomorrow, visit, vijayawada, ys jagan
  • whatsapp icon

విజయవాడలో బాలిక ఆత్మహత్య కేసులో టీడీపీ నేత వినోద్ కుమార్ జైన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలోని విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్ లో ఒక అపార్ట్ మెంట్ పై నుంచి నిన్న బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు బాలిక సూసైడ్ నోట్ రాసింది. బాలిక తొమ్మిదో తరగతి చదువుతుంది.

రెండు నెలలుగా....
అయితే అదే అపార్ట్ మెంట్ లో ఉంటున్న వినోద్ జైన్ బాలికను రెండు నెలలుగా వేధిస్తున్నాడు. బాలిక ఓపిక పట్టినా రోజూ లిఫ్ట్ వద్దకు వచ్చి వేధిస్తున్నాడు. దీంతో బాలిక వినోద్ కుమార్ జైన్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. వినోద్ కుమార్ జైన్ ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 37 వ డివిజన్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు.


Tags:    

Similar News